తమ్ముడూ... ఇరానీ కేఫ్‌లో కుమ్ముడూ!

తమ్ముడూ... ఇరానీ కేఫ్‌లో కుమ్ముడూ!


తమ్ముళ్లందరికీ గరమ్‌ గరమ్‌ ఛాయ్‌ తాగిద్దామని ఓ పహిల్వాన్‌ హైదరాబాద్‌ నడిబొడ్డున అమీర్‌ పేట్‌లోని ఇరానీ కేఫ్‌కి తీసుకొచ్చాడు. కాసేపటికి అక్కడికి ఓ సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు వచ్చాడు. చూపులకు కుర్రాడు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తున్నాడు. కానీ, ఛాయ్‌ కన్నా గరమ్‌గున్న అతడి కళ్లు ఎవర్నో వెతుకుతున్నాయి. కట్‌ చేస్తే... పహిల్వాన్‌తో పాటు తమ్ముళ్లను కుమ్మడం స్టార్ట్‌ చేశాడు. ఆ కుమ్ముతోంది పవన్‌కల్యాణ్‌. అతడి కుమ్ముడికి బలైంది విలన్లు.త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ సినిమాలో సై్టలిష్‌ ఫైట్‌ ఇలానే ఉంటుందట!హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో ఈ సినిమా కోసం ఇరానీ కేఫ్‌ సెట్‌ వేశారు. ప్రస్తుతం ఆ సెట్‌లో పవన్‌పై తీస్తున్న ఫైట్‌ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అవుతుందట. రెండు మూడ్రోజుల పాటు ఇరానీ కేఫ్‌లో షూటింగ్‌ చేస్తారట! హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు. ‘అత్తారింటికి దారేది’లో సమంతను కొందరు కిడ్నాప్‌ చేసి, ఇరానీ కేఫ్‌కు తీసుకెళితే, అక్కడామె కిడ్నాపర్లకు పవన్‌ ఫ్లాష్‌బ్యాక్‌ చెప్తుంది. ఇప్పుడీ సిన్మాలో ఇరానీ కేఫ్‌లో సీన్లు బదులు త్రివిక్రమ్‌ ఫైట్స్‌ పెట్టారన్న మాట!

Back to Top