మిమ్మల్ని మీరు ప్రేమించండి

ileana hashtag on Twitter - Sakshi

అభిమానులతో టచ్‌లో ఉండటం కోసం ఇలియానా తరచూ సోషల్‌ మీడియాలో చాట్‌ చేస్తుంటారు. రీసెంట్‌గా ట్వీటర్‌లో ఫ్యాన్స్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. ఆ సరదా సరదా చాట్‌ మీకోసం.
► మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చినవి?
కిక్, జల్సా
► మీరెప్పుడైనా బాడీ షేమింగ్‌కి గురయ్యారా?
చాలాసార్లు బాడీ షేమింగ్‌కి గురయ్యాను. మొదట్లో కాస్త బాధపడ్డాను. ఆ తర్వాత నా శరీరాకృతి ఎలా ఉందో దాన్ని ప్రేమించడం మొదలెట్టాను.
► నచ్చిన ఫుడ్‌?
అమ్మ చేసింది ఏదైనా.
► మీ వయసెంతో తెలుసుకోవచ్చా?
ఈ నవంబర్‌కి 32 వస్తాయి.
► పెట్స్‌లో మీకేది ఇష్టం. కుక్కలా? పిల్లులా?
రెండూ.
► మీ బ్యాగ్‌లో ఎన్ని మింట్‌ ప్యాకెట్స్‌ ఉంటాయి.
ప్రస్తుతానికైతే ఓ పెద్దది ఉంది.
► 8 ఏళ్ల తర్వాత తెలుగుకి తిరిగొచ్చారు. ఎలా అనిపిస్తుంది?
కొంచెం నెర్వస్‌గా, చాలా హ్యాపీగా ఉంది.
► మీరు అప్పుడప్పుడు ట్వీటర్‌లో పొయెటిక్‌గా రాస్తారు. ఎలా సాధ్యం?
ప్రాక్టీస్‌.
► వితంలో దేనిని అస్సలు కోల్పోకూడదు అనుకుంటున్నారు?
నా ఫ్యామిలీని.
► ఆండ్రూ నీబోన్‌తో లవ్‌లో ఉన్నారా?
అవును. పిచ్చిపిచ్చిగా.
► చాక్లెట్స్‌ ఇష్టమా? ఐస్‌క్రీమ్‌ ఇష్టమా?
చాక్లెట్స్‌.
► లవ్, మనీ రెండిట్లో ఒకటే వస్తుందంటే ఏం కోరుకుంటారు?
ప్రేమ.
► నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను నాకు నో చెప్పింది. కానీ నేనంటే తనకు చాలా ఇష్టం అనిపిస్తోంది. ఏం చేయాలి?
తను నో అని చెప్పింది అన్నావు కదా. తన నిర్ణయాన్ని గౌరవించు. ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను నిజంగా ప్రేమిస్తే ఆమె నీ దగ్గరకు వస్తుంది. వెయిట్‌ చెయ్‌.
► ఒక కోరిక కోరుకోవాలంటే ఏం కోరుకుంటారు?
ప్రపంచ శాంతి.
► నేను లావుగా ఉన్నాను. కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండాలి?
నీలా ఎవ్వరూ ఉండలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. పొట్టిగా, పొడుగ్గా, లావుగా, నల్లగా ఉండటం సహజ గుణాలు. ప్రతి ఒక్కరూ యునిక్‌. నీలా ఉండటం ఇంపార్టెంట్‌. అద్దంలో చూసుకొని నిన్ను నువ్వు ఇష్టపడే విషయాన్ని గుర్తు చేసుకో. నిన్ను నిన్నుగా అంగీకరించి ప్రేమించడం మొదలెట్టు.
► ఏ విషయానికైనా ఆందోళన చెందుతుండే వాళ్లకు ఏం చెబుతారు?
ఎవరైనా డాక్టర్స్‌ని కలవండి. నేను ఇదే డిజార్డర్‌తో బాధపడేదాన్ని. దాన్ని అధిగమించడానికి ఏం చేయాలా? అనుకున్నాను. ఫైనల్లీ డాక్టర్‌ని కలిశాను. నా డాక్టర్‌ నాకిచ్చిన సలహా చెబుతాను.. వినండి. ప్రతిదానికి అతిగా ఆలోచించి, అది అలా జరిగితే.. ఇది ఇలా జరిగితే అని అనుకునేదాన్ని. అలా అనుకునే బదులు ‘అయితే ఏంటి’ అని రీప్లేస్‌ చేయమని చెప్పారు. అప్పటినుంచి అలానే అనుకుంటున్నాను. అంతగా అవసరం లేని విషయాలు పట్టుకొని వేలాడటం మానేశాను. మీరూ మానేయండి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top