
అతడితో సంబంధం లేదు: నారా రోహిత్
తన పేరుతో డబ్బులు వసూలు చేసిన తాడికొండ సాయికృష్ణ అనే వ్యక్తితో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో నారా రోహిత్ తెలిపాడు.
హైదరాబాద్: తన పేరుతో డబ్బులు వసూలు చేసిన తాడికొండ సాయికృష్ణ అనే వ్యక్తితో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో నారా రోహిత్ తెలిపాడు. గతంలో తనకు అతడు అభిమాని మాత్రమేనని స్పష్టం చేశాడు. ఓ అభిమానిగా మాత్రమే అతడితో పరిచయం ఉందని, అంతకుమించి తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని వెల్లడించాడు.
తన పేరుతో అభిమానులు డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తన పేరు చెప్పి డబ్బులు అడిగితే వెంటనే తనకు సమాచారం అందించాలని అభిమానులకు సూచించాడు. తనతో సినిమా తీస్తానని సాయికృష్ణ కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నారా రోహిత్ స్పందించాడు. అభిమానులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.