హారర్ కామెడీ
హారర్, కామెడీ నేపథ్యంగా సరికొత్త స్క్రీన్‌ప్లేతో రూపొందనున్న సినిమా హైద రాబాద్‌లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఓ ప్రముఖ హీరో ప్రధాన పాత్రలో, నూతన నటి రంజనా నారాయణ్ హీరోయిన్గా నూతన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి అన్నపూర్ణ ఫిలింస్ పతాకంపై రామ్మోహన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం సమపాళ్లలో ఉంటుంది. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘ఇలాంటి మంచి సినిమా ద్వారా తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. కథానాయికగా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది’’ అని రంజనా నారాయణ్ అన్నారు.