బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ నటిమణులపై సంచలన వ్యాఖ్యలు

Heroine Hansika fires on Bigg boss contestant Hina Khan - Sakshi

హీనాఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన హన్సిక

దక్షిణాది నటీమణులు, దర్శక నిర్మాతల గురించి బాలీవుడ్‌ బుల్లితెర నటి హీనాఖాన్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రస్తుతం హీందీలో ప్రసారం అవుతోన్న ‘బిగ్‌బాస్‌’  సీజన్‌ 11లో కంటెస్టెంట్‌గా ఉన్నారు. దీనికి హీరో సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. షోలో ఓ సందర్భంలో హీనాఖాన్‌ దక్షిణాది నటిమణుల గురించి మాట్లాడారు. వారికి హీరోయిన్లు స్లిమ్‌గా ఉంటే నచ్చదని, లావుగా ఉంటేనే అవకాశాలు ఇస్తారని పేర్కొంది. 

అంతేకాక అవకాశాలు ఇస్తే బరువు పెరగాలని కండిషన్స్‌ పెడతారని అన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నటిమణులు ఎక్స్‌ పోజింగ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటి వారినే ప్రేక్షకులు ఇష్టపడుతారని ఆమె అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు విరుచుకుపడ్డారు. హీనాఖాన్‌ వ్యాఖ్యలపై హీరోయిన్‌ హన్సిక మండిపడ్డారు. తాను దక్షిణాది నటిగా గర్వపడుతున్నాననీ, హీనాఖాన్‌ వ్యాఖ్యలు బుల్‌షిట్‌గా ఉన్నాయని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దక్షిణాదిలో అవకాశాలతో నటిగా ఎదిగింది ఈ ముంబాయి భామ. కోలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాలలో నటించి మంచి పాపులర్‌ అయింది. ప్రస్తుతం హన్సికకు అవకాశాలు తగ్గిపోయాయి. డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవాతో గులేభకావళి చిత్రంలో నటిస్తున్నారు. అదే విధఃగా మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా నటించిన విలన్‌ చిత్రంలో నటించారు హన్సిక. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top