యజమాని కుట్ర | He is a trustworthy pawn owner | Sakshi
Sakshi News home page

యజమాని కుట్ర

Jul 21 2017 11:57 PM | Updated on Sep 5 2017 4:34 PM

యజమాని కుట్ర

యజమాని కుట్ర

యజమానికి నమ్మిన బంటు అతను. అయితే ఆ యజమాని తన స్వార్థం కోసం ఆ వ్యక్తిని చంపాలనుకుంటాడు.

యజమానికి నమ్మిన బంటు అతను. అయితే ఆ యజమాని తన స్వార్థం కోసం ఆ వ్యక్తిని చంపాలనుకుంటాడు. ఆ కుట్ర అతనికి తెలిసిపోయింది. అప్పుడతను ఎలా రియాక్ట్‌ అయ్యాడు... అనే అంశాలతో రూపొందిన కన్నడ చిత్రం ‘రథావరం’. ‘ది అల్టిమేట్‌ వారియర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. శ్రీమురళి, రచితారామ్‌ జంటగా చంద్రశేఖర్‌ బడియప్ప డైరెక్ట్‌ చేశారు.

ధర్మశ్రీ ఎంటర్‌ప్రైజెస్‌పై మంజునాథ్‌. ఎన్‌ నిర్మించారు. తెలుగులో ఇదే టైటిల్‌తో వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్‌  కానుంది. మంజునాథ్‌ మాట్లాడుతూ– ‘‘పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్‌ లవ్‌స్టోరీ ఇది. రథావరం అంటే నమ్మిన బంటు అని అర్థం. ఈ సినిమాలో హిజ్రాల ప్రాముఖ్యతను తెలియజేసే ప్రయత్నం చేశాం. క్లాస్, మాస్‌ ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement