‘బ్రేకప్‌ నన్ను బ్రేక్‌ చేయలేదు..చంపనూలేదు’

Harleen Sethi Emotional Post On Break Up Goes Viral - Sakshi

‘ఎక్కడి నుంచి మొదలయ్యాను.. ఎక్కడికి చేరుకున్నాను.. దీనికంటూ ప్రత్యేకంగా దారిని రూపొందించుకోలేదు.. అతడి అభీష్టాన్ని స్వాగతించాను .......భయం లేకుండా అతివేగంగా.. శక్తిమంతంగా మరియు జాగరూకతతో.. నన్ను నేను కనుగొన్నా.. ఓ పెద్ద కోనేటిలో చిన్న చేపను నేనని......వెర్రిచేష్టలను పిచ్చి ప్రదర్శనలను.. భావోద్వేగాలను ఆస్వాదించాను.. ప్రతీరోజూ బతికే ఉన్నాననే భావనతో.. నాకంటూ ఓ మార్గాన్ని సృష్టించుకుంటున్నా......ఒకరితో స్నేహం నన్ను నిర్మించలేదు... బ్రేకప్‌లు నన్ను పడదోయలేవు... అపజయాలు నన్ను చంపేయనూలేవు.......సరిపోయినంతగా... సంపూర్ణంగా... నా కంటూ ఓ వ్యక్తిత్వం... నా కంటూ ఓ గుర్తింపుతో... ఉన్నానని భావిస్తున్నా’ అంటూ బాలీవుడ్‌ నటి హర్లీన్‌ సేథీ భావోద్వాగానికి లోనయ్యారు. ప్రేమలో విఫలమైనప్పటికీ మానసికంగా తానెంతో దృఢంగా ఉన్నానంటూ..  సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో తన భావాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టాలో పద్యాన్ని పోస్ట్‌ చేసిన హార్లిన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎంతో అందమైన నీ వాక్యాలు.. గుండె పగిలిన ఓ అమ్మాయి భావాలను అద్భుతంగా పలికించాయి. నీకంటూ ఓ గుర్తింపు ఉంది. ఎవరికోసమో బాధ పడాల్సిన అవసరం లేదనే నిజాన్ని ఎంత చక్కగా చెప్పావో. త్వరలోనే నీ జీవితంలోకి అందమైన రోజులు వస్తాయి’ అంటూ ఆమెకు బాసటగా నిలుస్తున్నారు.

కాగా ‘యురి’ సినిమా ఫేం విక్కీ కౌశల్‌-  హర్లీన్‌ సేథీల మధ్య గత కొంతకాలంగా దూరం పెరిగిపోయిందని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో హర్లీన్‌, విక్కీ కౌశల్‌ను అన్‌ఫాలో చేసినప్పటి నుంచి వీరిద్దరు విడిపోయినట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హిందుస్తాన్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వూలో హర్లీన్‌తో తాను తెగదెంపులు చేసుకున్నట్టు విక్కీ కౌశల్‌ ధ్రువీకరించగా.. హార్లిన్‌ మాత్రం బాహాటంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టును బట్టి వీరు విడిపోయారన్న విషయం కన్‌ఫామ్‌ అయిపోయిందని బీ-టౌన్‌ ప్రేక్షకులు భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top