పవన్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌

good news for pawan kalyan fans - Sakshi

సాక్షి, సినిమా:  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 7న త్రివిక్రమ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సిమాలోని మొదటి పాటను పవన్‌ అభిమానులకు గిఫ్ట్‌గా ఇవ్వాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నారు. 

పవన్‌ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ట్యూన్స్ ప్రిపేర్ చేస్తుండగా రూపొందించిన స్పెషల్ వీడియో  విడుదల చేశారు. ఈ వీడియోలో త్రివిక్రమ్‌ అనిరుద్‌ పాడుతుంటే ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.  ఈ నెల 7న ఆ పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు. హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top