పెళ్లిపై మౌనం వీడిన ప్రియాంక చోప్రా

Global Star Priyanka Chopra Hints About Wedding  - Sakshi

లండన్‌ : గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ల మధ్య రొమాంటిక్‌ అనుబంధం బలపడుతున్న క్రమంలో వీరి వివాహంపై జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రియాంక, నిక్‌ల మధ్య సన్నిహిత సంబంధంపై వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో వివాహ వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని, తన జీవితంలో ఏదో ఒక దశలో వైవాహిక బంధం ముడిపడుతుందని ప్రియాంక చెప్పుకొచ్చారు.

వివాహ బంధంతో ఒక్కటవడం అంటే తనకెంతో ఇష్టమని, ఒకానొక దశలో తాను ఈ బంధంలో తప్పక అడుగుపెడతానన్నారు. వివాహమనేది ఒకరిని పెద్దగానో, చిన్నగానో లేకుంటే ఫెమినిస్ట్‌గానో, మరొకరిగానే మార్చదని స్పష్టం చేశారు.

మహిళలను మనం జడ్జ్‌ చేయకుండా వారి ఇష్టానుసారం ఉండేలా చేయాలని కోరుకోవడమే ఫెమినిజమని ప్రియాంక పేర్కొన్నారు. కాగా ప్రియాంక చోప్రా, నిక్‌ జొనాస్‌లు పలు సందర్భాల్లో సన్నిహితంగా కనిపించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని, త్వరలోనే వీరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారనే ప్రచారం సాగింది. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top