తాగుడు తెచ్చిన తంటా!

The Girl On The Train First Look Released - Sakshi

తాగి మోటార్‌ వెహికల్‌ను నడిపితే అది ఎంతటి దారుణ ప్రమాదానికి దారి తీస్తుందో ఊహించి చెప్పడం కష్టం. మత్తులో రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలు నడపడమే రిస్క్‌ అంటే.. ఫుల్‌గా తాగి ఏకంగా ఓ రైలును నడపడానికి సిద్ధమయ్యారు పరిణీతీ చోప్రా. ఇక మద్యపానం వల్ల వృత్తిపరంగా ఉద్యోగం పొగొట్టుకుంటే, వ్యక్తిగతంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలు చాలవన్నట్టు ఓ మిస్సింగ్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ ప్రాబ్లమ్‌ ఆమె చుట్టూ తిరుగుతుంది. పరిణీతి నటిస్తున్న తాజా చిత్రం స్టోరీ లైన్‌ ఇదేనట.

రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మద్యపానం అలవాటు ఉన్న మహిళ పాత్రలో పరిణీతి చోప్రా నటిస్తున్నారట. అదితీ రావ్‌ హైదరీ, కృతీ కుల్హరీ, అవినాష్‌ తివారి కీలక పాత్రధారులు. 2016లో విడుదలైన ఇంగ్లీష్‌ చిత్రం ‘ద గాళ్‌ ఆన్‌ ద ట్రైన్‌’కు ఇది హిందీ రీమేక్‌. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. బుధవారం ఈ సినిమాలో పరిణీతీ చోప్రా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top