కియారా అనే నేను

Funday special chit chat with heroine kiara advani - Sakshi

కియారా అద్వాని. ఇండియన్‌ క్రికెట్‌ లెజెండ్‌ ‘ఎం.ఎస్‌. ధోని’ బయోపిక్‌లో కియారా మనకు కనిపించినప్పుడు ఆమెకు తెలుగు సినీ పరిశ్రమ అసలు పరిచయమే లేదు. రెండేళ్లు ఇలా గడిచిపోయాయి. ఇప్పుడామె తెలుగులో పాపులర్‌ హీరోయిన్‌. మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌ లాంటి టాప్‌ హీరోల సినిమాల్లో వరుసగా నటించేస్తోంది. లేటెస్ట్‌ సెన్సేషన్‌ కియారా గురించి కొన్ని విశేషాలు.... 

అలియా టు కియారా! 
ముంబైలో పుట్టి పెరిగిన కియారా అద్వాని అసలు పేరు అలియా అద్వాని. చిన్నప్పట్నుంచీ నటనంటే ఆసక్తి ఉండటంతో టీనేజ్‌ పూర్తవ్వడంతోనే  సినీ పరిశ్రమలో అవకాశాల కోసం తిరగడం మొదలుపెట్టింది. అయితే అదే పేరుతో ఇప్పటికే బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ స్టేటస్‌తో అలియా భట్‌ దూసుకుపోతోంది. అలియా – అలియా పేర్లు అయోమయంగా మారిపోతాయని చెప్పి, కియారా అని పేరు మార్చుకోమని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ చెప్పాడట. ఆయన చెప్పినట్టే అలియా అద్వాని పేరు మార్చుకొని కియారాగా సూపర్‌ సక్సెస్‌తో దూసుకెళ్తోంది. 

సక్సెస్‌.. సక్సెస్‌.. సక్సెస్‌.. 
‘ఎం.ఎస్‌. ధోని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ ఆకర్షించిన కియారా, ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ సినిమాయే సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుతో చేసింది. మహేశ్‌తో కలిసి ఆమె నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో ఆమె అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో వెంటనే మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కొత్త సినిమాలో హీరోయిన్‌ ఆఫర్‌ కొట్టేసింది కియారా. జనవరిలో రామ్‌చరణ్‌ – కియారా అద్వాని సినిమా విడుదలవుతుంది. ఈ మధ్యలో బాలీవుడ్‌లో వచ్చిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ కియారాను యూత్‌ సెన్సేషన్‌గా మార్చేసింది. 

ఫ్లాప్‌ ఎంట్రీ! 
ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లో హీరోయిన్‌ అవకాశం దక్కించుకున్న కియారాకు మొదటి సినిమా ‘ఫగ్లీ’తోనే పెద్ద ఫ్లాప్‌ ఎదురైంది. ‘ఫగ్లీ ఫ్లాప్‌ అయినప్పుడు నా కెరీర్‌ ఏమైపోతుందో అని భయపడ్డా. ఆ తర్వాత ‘ఎం.ఎస్‌.ధోని’తో వెంటనే సక్సెస్‌ వచ్చింది. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి మధ్య ఈక్వేషన్స్‌ బాగా మారిపోతాయి. అది కెరీర్‌ మొదట్లోనే అర్థం చేసుకునే అవకాశం దక్కిందనుకుంటా’ అంటుంది కియారా, డెబ్యూట్‌ సినిమాను గుర్తు చేసుకుంటూ. 

బోల్డ్‌ అన్డ్‌ బ్యూటిఫుల్‌... 
‘లస్ట్‌ స్టోరీస్‌’ అనే సినిమా ఇండియాలో ఒక సెన్సేషన్‌. లైంగిక స్వేచ్ఛ అనే అంశాన్ని స్పృశిస్తూ వచ్చిన ఈ సినిమాలో కియారా అద్వాని బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది. ‘బోల్డ్‌గా నటించడం ఏదో క్రేజ్‌ కోసం చేసినట్టు ఉండకూడదు. కథలో ఎంతో బ్యూటీ ఉండి, బోల్డ్‌గా ఉండాల్సిన అవసరం వస్తే చేయాలి.’ అంటూ లస్ట్‌ స్టోరీస్‌ గురించి చెబుతుంది కియారా. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ ఆమె క్రేజ్‌ను పెంచింది. 

లైఫ్‌ అంటేనే లవ్‌..
‘చిన్నప్పట్నుంచే సినిమాల్లో నటించడం అన్నది నా కల. ఈరోజు నార్త్‌లో, సౌత్‌లో హీరోయిన్‌గా ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ఇది ఇలాగే జరగకపోయినా నేను హ్యాపీగానే ఉండేదాన్ని. లైఫంటేనే లవ్‌ అని చెబుతా నేను. అది ఎలాంటి మలుపులు తీసుకున్నా ప్రేమిస్తూనే ఉండాలి.’ అంటుంది కియారా, జీవితం గురించి, తన కెరీర్‌ గురించి, సక్సెస్‌ గురించి మాట్లాడినప్పుడు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top