మహేష్‌ బాబు ఫ్యాన్సా మజాకా!

Fan Made Poster Of Mahesh Babu Goes Viral - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌కు లేడీ ఫాలోయింగ్‌ అధికం. ఇటీవలె ‘భరత్‌ అనే నేను’తో తిరుగులేని హిట్‌ కొట్టాడు మహేష్‌. 

ప్రస్తుతం మహేష్‌ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో కాలేజ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేశారు. ఈ సినిమా కోసం మహేష్‌ గడ్డం కూడా పెంచేస్తున్నాడు. ఆ లుక్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆగస్టు 9న మహేష్‌ పుట్టిన రోజు.

ఇక ఫ్యాన్స్‌కు ఆ రోజు పండుగే. ఆ రోజును ఇంకా ప్రత్యేకంగా మలిచేందుకు తన కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక ఆ లోపు అభిమానులు ఊరికే ఉంటారా? ఒక మ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ను సృష్టించేశారు. ఇది మాములు విషయమే. కానీ దాని బ్యాగ్రౌండ్‌లో 43 భాషల్లో మహేష్‌కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు అభిమానులు. ఇక మహేష్‌ 25వ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top