వినోదమే ప్రధానంగా 'సాగర్' సినిమా

వినోదమే ప్రధానంగా  'సాగర్' సినిమా

బుల్లితెరపై మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాగర్ వెండితెర రంగప్రవేశం చేస్తున్నారు. ఆయన హీరోగా అభి స్టూడియోస్ పతాకంపై బి. సత్యనారాయణ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. పి.ఎ. అరుణ్‌ప్రసాద్ దర్శకుడు. డా. రాజేంద్రప్రసాద్, రాశి కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో సాగర్ సరసన మృదుల కథానాయికగా నటిస్తున్నారు. పాటలు మినహా ఈ చిత్రం పూర్తయ్యింది. 

 

 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది. రాజేంద్రప్రసాద్‌గారి పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. ఆయన మా సినిమాలో నటించడం, ఈ చిత్రం ద్వారా రాశిగారు రీ-ఎంట్రీ కావడం ఆనందంగా ఉంది. టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సాగర్ అద్భుతంగా నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top