తప్పతాగి బాలీవుడ్‌ హీరోపై దాడి!

Drunken man attacked Arjun Kapoor - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ యువ హీరో అర్జున్‌ కపూర్‌ పై దాడి జరిగింది. అతని తాజా చిత్రం ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ చిత్ర సెట్స్‌ కు వచ్చిన ఓ వ్యక్తి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే వంకతో అర్జున్‌ పై దాడి చేశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఫుల్‌గా తాగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారమే ఈ ఘటన చోటు చేసుకుంది. 

పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం... ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లోని ఫింథోర్‌ఘడ్‌లో జరుపుకుంటోంది. ఈ క్రమంలో కమల్‌ కుమార్‌ అనే ఓ డ్రైవర్‌ సెట్స్ లోకి వచ్చాడు. వానిటీ వ్యాన్‌ దగ్గర అర్జున్‌ ను కలిసి షేక్‌ హ్యాండ్‌ కోరాడు. ఆపై అతని చెయ్యిని మెలితిప్పటం ప్రారంభించాడు. ఇది గమనించిన చిత్ర యూనిట్‌ సభ్యులు కమల్‌ను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో అర్జున్‌ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కాగా, దాడి చేయటంతోపాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ నేరం కింద అతనికి శిక్ష పడనుంది. 

ఇదిలా ఉంటే దిబకర్‌ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌ వచ్చే ఏడాది ఆగష్టు 18న విడుదల కానుంది. ఇందులో అర్జున్‌ ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. 

నాపై దాడి జరగలేదు.. అర్జున్‌ కపూర్

తనపై దాడి జరిగిందని మీడియాలో వస్తున్న వార్తలపై నటుడు అర్జున్‌ కపూర్‌ స్పందించాడు. ఈ మేరకు కాసేపటి క్రితం ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేశాడు. నాపై ఎలాంటి దాడి జరగలేదు. మీడియాకు ఆ వార్త ఎలా వచ్చిందో తెలీదు. ఈ వార్తతో నా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దయచేసి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కానివ్వకండి అంటూ మీడియాకు అర్జున్‌ విజ్ఞప్తి చేశాడు. కాగా,  ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించటంతో తెగ వైరల్‌ అయ్యింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top