కంగనా.. తాగి నా గదికి వచ్చింది!

drunk' Kangana knocked my hotel room - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమర ప్రేమికులనిపించుకున్న కంగన రనౌత్‌-హృతిక్‌ రోషన్‌ల వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. దాదాపు ఏడాదిన్నరగా నడుస్తున్న వీరి వివాదం.. ఎప్పటికప్పుడు ట్విస్ట్‌లతో సాగిపోతోంది. వీరిద్దరి ప్రేమాయణం సంగతి ఏమోకానీ.. వీరి సమస్య మాత్రం జాతీయ సమస్యలా మారిపోయింది. టీవీ చర్చల్లో కూడా వీరి వివాదంపై డిబేట్‌ సాగుతోంది. తాజాగా ఒక టీవీ చర్చలో పాల్గొన్న హృతిక్‌ రోషన్‌.. కంగన గురించి మరిన్ని షాకింగ్‌ విషయాలు చెప్పాడు.. ఆయన మాటల్లోనే చూద్దాం.

‘‘ఒక షూటింగ్‌ నిమిత్తం నేను కంగన.. సినిమా యూనిట్‌ మొత్తం జోర్డాన్‌ వెళ్లాం. షూటింగ్‌ బాగా సాగుతోంది. ఒక రోజుమ షూటింగ్‌ అయిపోయాక హోటల్‌లో యూనిట్‌ పార్టీ చేసుకుంది. ఆ పార్టీలో నేనూ పాల్గొన్నా.. పార్టీ అనంతరం లేచి వెళుతున్న సమయంలో కంగన వచ్చి.. నీతో మాట్లాడాలి అంది. నేను అప్పటికే బాగా అలసిపోయి ఉండడంతో ఉదయం మాట్లాడుకుందాం అని చెప్పి రూమ్‌కు వెళ్లా. కొద్ది సేపటి తరువాత వచ్చిన కంగన.. మద‍్యం మత్తులో నా గది తలుపు కొడుతోంది’’  అని హృతిక్‌ చెప్పారు. మద్యం మత్తులో కంగన అల్లరి చేస్తున్న సమయంలో అక్కడి వచ్చిన ఆమె చెల్లెలు.. రంగోలి.. అక్క గురించి ఏమీ అనుకోకండి.. చాలా మంచిది అని చెప్పి వెళ్లిందని హృతిక్‌ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top