‘దువ్వాడ జగన్నాథమ్’ మరో ఘనత

‘దువ్వాడ జగన్నాథమ్’ మరో ఘనత


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ టీజర్ ఆన్ లైన్ లో దూసుకుపోతోంది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24న విడుదల చేసిన ఈ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. యూట్యూబ్ లో కోటికిపైగా వ్యూస్‌ సాధించింది.తన సినిమా టీజర్ కు ఊహించిన దానికంటే స్పందన రావడంతో హీరో అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన తెలుగు సినిమాల్లో తన చిత్రం కూడా ఉండడం పట్ల హర్షాతిరేకం తెలిపాడు. ట్విటర్ ద్వారా ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాడు.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించాడు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Back to Top