రీమేక్‌పై దృష్టి పెట్టిన దిల్‌ రాజు!

Dil raju Wants To Remake Vijay sethupathi 96 Movie - Sakshi

విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమా టీజర్‌తోనే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఒక్క డైలాగ్‌ లేకుండా టీజర్‌ను రిలీజ్‌ చేసి అందరిలోనూ ఆసక్తికని పెంచేశారు చిత్రయూనిట్‌. తమిళ్‌లో అక్టోబర్‌ 4న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ మూవీని ప్రత్యేకంగా వీక్షించిన దిల్‌ రాజు తెలుగులో రీమేక్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. 

ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. అధికారికంగా ప్రకటించేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు ఇతర విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నాని, సమంతలు నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాని, సమంతలు ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ సినిమాలతో సందడి చేసిన విషయం తెలిసిందే.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top