రొమాంటిక్‌ పార్టనర్‌ దొరకడం కష్టం : దీపికా

Difficult to find a secure romantic partner: Deepika - Sakshi

ముంబయి : భద్రతనిచ్చే రొమాంటిక్‌ పార్టనర్‌ను గుర్తించడం చాలా కష్టమని బాలీవుడ్‌ ప్రముఖ నటి దీపికా పదుకునే అన్నారు. విజయాన్ని, ఫ్యాషన్‌ను అర్థం చేసుకునే భాగస్వామిని గుర్తించడం చాలా క్లిష్టమైన సమస్య అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పద్మావతి చిత్రం షూటింగ్‌లో ఉన్న ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ 'చాలాకాలంగా రొమాంటిక్‌ సంబంధాలు ఆందోళనకరంగా, క్లిష్టంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకరి విజయాన్ని, అభిరుచిని, చేసే పనిని, ఒక వేళ ఆ వ్యక్తికంటే ఎక్కువ మొత్తంలో సంపాధించినా ఆ విషయం అర్ధం చేసుకోగల భాగస్వామిని గుర్తించడం చాలా కష్టం.

ఇక నా విషయానికొస్తే నా వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని బలంగా ఉండేవి.. కానీ, ఇటీవల వాళ్లలో కొందరు నాకు దూరంగా వెళ్లిపోతున్నారు. నా స్కూల్‌ స్నేహితుల్లో కొంతమందికి నేను బాగా దగ్గరయ్యాను. ఎందుకంటే మేం ఎప్పటికప్పుడు ఒకరికొకరం టచ్‌లోనే ఉంటున్నాం. కొంతమందికి విజయం అందివచ్చినప్పుడు దానిని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలియదు. ఆ విజయం కొంతమందిని దూరం చేస్తుంది కూడా. అయితే, నేను అలాంటి సందర్భాల్లో నిరుత్సాహానికి గురికాలేదు. ఎందుకంటే అవన్నీ జీవితపయనంలో భాగం' అంటూ పలు విషయాలు ఆమె చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top