‘పద్మావతి’ ఎంత పని చేసింది!

‘పద్మావతి’ ఎంత పని చేసింది!


బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ సరసన నటించే ఛాన్స్‌ వస్తే ఎవరైనా కాదనుకుంటారా? పైగా మొదటి సినిమాకి అవకాశం ఇచ్చిన ఈ హీరోగారికి ‘నో’ చెప్పగలుగుతారా అని బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. ఈ చర్చకు కారణం షారుక్‌ సినిమాకి దీపికా పదుకొనె ‘నో’ చెప్పడమే. షారుక్‌ నటించిన ‘ఓం శాంతి ఓం’ ద్వారా దీపిక హిందీకి కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె కెరీర్‌ పుంజుకోవడం, ప్రస్తుతం టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిలా దూసుకెళ్లడం జరిగాయి. అందుకే షారుక్‌ అంటే దీపికాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయినప్పటికీ ఆయన తాజా చిత్రంలో నటించడానికి అంగీకరించలేదట.



ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్‌ ఉందట. కత్రినా కైఫ్, దీపికా పదుకొనే పేర్లను చిత్రబృందం పరిశీలనలోకి తీసుకుని, వారిని సంప్రదించగా దీపికా పదుకొనే యాక్ట్‌ చేసేందుకు ఒప్పుకోలేదట. దానికి కారణం సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఆమె చేస్తోన్న తాజా చిత్రం ‘పద్మావతి’. కొన్ని వివాదాల కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ముందు అనుకున్న డేట్స్‌ కన్నా ఎక్కువగానే దీపికా కేటాయించాల్సి వస్తోందట.



అందుకే షారుక్‌ మూవీకి డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయడం కుదర్లేదని సమాచారం. ఇలా జరిగినందుకు దీపికా కూడా బాధపడుతున్నారట. ‘పద్మావతి’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్నట్లు ఈ ఏడాది నవంబర్‌ 17నే విడుదల చేయాలని దర్శకుడు బన్సాలీ స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యారట. అందుకే ఒక్క దీపికా మాత్రమే కాదు.. ఈ చిత్రంలోని స్టార్లందరూ ఇతర సినిమాలకు ‘నో’ చెప్తున్నారని టాక్‌.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top