నా గారాలపట్టి..ఐ లవ్‌ యూ: దీపిక

Deepika Padukone Adorable Wishes To Hubby Ranveer On His Birthday - Sakshi

‘సున్నితమైన మనస్తత్త్వం, సహృదయం, భావోద్వేగాలతో నిండిన మనస్సు.. హాస్యాన్ని పండించే చతురత, తెలివితేటలు.. నమ్మకం.. ఇలా ఒక్కటేమిటి మరెన్నో సుగుణాలతో ప్రకాశించే.... నా భర్త, స్నేహితుడు, ప్రియుడు, విశ్వాసపాత్రుడు....అంతేకాదు నా చిన్నారి, నా బేబి, నా గారాల పట్టి, నా పైనాపిల్‌, నా సూర్యోదయం, నా ఇంద్రధనుస్సు.... నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి... నిన్ను ప్రేమిస్తూనే ఉంటా... ఐ లవ్‌ యూ’ అంటూ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టు వైరల్‌ అవుతోంది. శనివారం తన భర్త, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పుట్టినరోజు సందర్భంగా అతడి పట్ల ఉన్న భావాలను దీపిక ఇన్‌స్టాలో పంచుకున్నారు. రణ్‌వీర్‌ చిన్ననాటి ఫొటో పోస్ట్‌ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో రణ్‌వీర్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. ‘రణ్‌వీర్‌ను భర్తగా పొందినందుకు మీరెంతో అదృష్టవంతులు. తను చాలా మంచివాడు. మీ బంధం కలకాలం ఇలాగే వర్థిల్లాలి. హ్యాపీ బర్త్‌డే రణ్‌వీర్‌’ అంటూ అభిమానులు విషెస్‌ చెబుతున్నారు.

కాగా రామ్‌లీల సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన దీపికా-రణ్‌వీర్‌ ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమపక్షులుగా విహరించి దీప్‌వీర్‌ జంట గతేడాది నవంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లేక్‌ కోమో వేదికగా కొంకిణీ, ఆనంద్‌ కరాజ్‌ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. దీపిక ప్రస్తుతం చపాక్‌ సినిమాతో బిజీగా ఉండగా.. రణ్‌వీర్‌... ప్రపంచకప్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న(కపిల్‌దేవ్‌ బయోపిక్‌ ఆధారంగా) 83 సినిమాలో నటిస్తున్నాడు. ఇక పెళ్లైన తర్వాత దీపికా- రణ్‌వీర్‌ తొలిసారిగా ఈ సినిమాలో రీల్‌లైఫ్‌ భార్యభర్తలుగా నటిస్తుండటం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top