చరణ్‌కు చిరు సర్‌ప్రైజ్‌

Chiranjeevi Visits Ram Charan 12 Sets - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్‌ యాక్షన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు యూరప్‌లో అజర్‌బైజాన్‌ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు.

అయితే ఈ మూవీ సెట్‌లో సడన్‌గా మెగాస్టార్‌ దర్శనమిచ్చారు. ఆర్సీ 12 షూటింగ్ లొకేషన్‌లో నిర్మాత దానయ్యతో కలిసి చిరు దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాల కోసం సిద్ధమవుతున్న మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్ తాజా చిత్ర షూటింగ్ లోకెషన్‌కు వెళ్లారు. రోజంతా చెర్రీతో కలిసి సెట్‌లోనే గడిపిన మెగాస్టార్‌ మరో రెండో రోజుల పాటు అక్కడే ఉంటారని తెలుస్తోంది. జగపతి బాబు, శరత్‌ కుమార్‌, ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), ఆర్యన్‌ రాజేష్‌, ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top