'సై రా' మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్

Chiranjeevi Sye raa movie Update - Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 151వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. 150వ సినిమాగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు, తదుపరి చిత్రాన్ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు. మెగా తనయుడు రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చారిత్రక చిత్రంలో ఇతర భాషల నటులు కూడా పెద్ద సంఖ్యలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

డిసెంబర్ తొలి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు షూటింగ్ మొదలైన దగ్గర నుంచే మేకింగ్ వీడియోస్ ను రిలీజ్ చేసే విధంగా ఆ సంస్థ ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతానికి ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా. మెగా అభిమానులు మాత్రం సై రా షూటింగ్ అప్ డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని సంబరపడిపోతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top