డబుల్‌ ట్రీట్‌?

Chiranjeevi To Romance with Aishwarya Rai - Sakshi

కమ్‌బ్యాక్‌ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’లో క్లాస్, మాస్‌ పాత్రల్లో డబుల్‌ యాక్షన్‌ చేశారు చిరంజీవి. ప్రేక్షకులకు అది డబుల్‌ ట్రీట్‌లా అనిపించింది. ఇప్పుడు మరోసారి చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలిసింది. ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ డ్యూయల్‌ రోల్‌ తండ్రీ కొడుకులా? అన్నదమ్ములా? అనేది తెలియాల్సి ఉంది. ఇందులో చిరంజీవికి జోడీగా ఐశ్వర్యారాయ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. వచ్చే ఏడాది ఉగాదికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top