కరోనాపై పోరాటం: చిరంజీవి, మహేశ్‌లు సైతం

Chiranjeevi And Mahesh Donates One Crore Rupees to Fight Against Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా పోరాటంలో భాగంగా ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్‌ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని ప్రకటిస్తున్నారు. భారత ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పేద ప్రజలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. అయితే పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులు నితిన్‌, రామ్‌చరణ్‌, పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అనిల్‌ రావిపూడి, దిల్‌ రాజ్‌ తదితరులు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. 

కాగా, తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఏకతాటిపై రావాలని, ప్రభుత్వాల సూచనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా మహేశ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కరోనాపై పోరాటంలో ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా ప్రభుత్వానికి సహాయసహకారాలు అందించాలని కోరారు.  

చిరంజీవి రూ. కోటి విరాళం
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా, సీరియల్‌ షూటింగ్‌లు రద్దయ్యాయి. దీంతో అనేక మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. రెక్కాడితే గాని డొక్కడని సినీ పేద కార్మికులకు కోసం మెగాస్టార్‌ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. కాగా, నాంది సినిమా హీరో అల్లరి నరేశ్‌, నిర్మాత సతీష్‌లకు కూడా తమ చిత్రానికి చెందిన 50 మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ. పది వేల చొప్పున విరాళం అందించారు.

చదవండి: 
‘ఊపిరి తిత్తులు ఇలాగే ఉక్కిరిబిక్కిరి అవుతాయి’
ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌
మోదీ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు : సోనియా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top