ఒక్క అడుగు దూరంలో...

ఒక్క అడుగు దూరంలో...


ఇంకొక్క అడుగు పడితే వెండితెరపై మరోసారి యువరాణిగా కనిపించే అవకాశం హన్సికనే వరిస్తుందని చెన్నై సినిమా జనాలు అంటున్నారు. ఆల్రెడీ ‘పులి’లో హన్సిక యువరాణిగా నటించారు. తాజాగా తమిళ దర్శకుడు సుందర్‌ సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్న భారీ బడ్జెట్‌ హిస్టారికల్‌ ఫిల్మ్‌ ‘సంఘమిత్ర’లో హన్సిక టైటిల్‌ రోల్‌ చేసే ఛాన్సుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.అయితే, దర్శక–నిర్మాతలు ‘సంఘమిత్ర’గా ఎవర్నీ ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. తాజా ఖబర్‌ ఏంటంటే... ఇటీవల హన్సికకు లుక్‌ టెస్ట్‌ జరిగిందట! ‘సంఘమిత్ర’గా ఆమె ఎలా ఉంటుందోనని చెన్నైలోని బిన్నీ మిల్స్‌లో ఫొటోషూట్‌ చేశారట. దర్శక, నిర్మాతలు హన్సిక లుక్‌ పట్ల హ్యాపీ అయితే... ఆమె నెక్స్‌›్ట స్టెప్‌ సినిమాకు సైన్‌ చేయడమే. దర్శకుడు సుందర్‌. సీకి హన్సిక లక్కీ మస్కట్‌. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. సో, ‘సంఘమిత్ర’లో హాన్సిక ఆల్మోస్ట్‌ ఫైనలైజ్‌ అయినట్లేనని చెన్నై టాక్‌!!

Back to Top