అందమైన ప్రేమకథ

'Chalte Chalte' ready for release in February - Sakshi

‘పిట్టగోడ’ సినిమా ఫేమ్‌ విశ్వదేవ్‌ రాచకొండ, ప్రియాంక జైన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘చల్తే చల్తే’. ప్రదీప్‌ కేకే దర్శకత్వంలో అమేజింగ్‌ ఆర్ట్స్‌ పతాకంపై శ్రీనివాసరావు పొట్లూరి, ప్రదీప్‌కుమార్‌ కోనేరు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను  విడుదల చేశారు.

ప్రదీప్‌ కేకే మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రమిది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి ప్రశంసలు వచ్చాయి. విశ్వదేవ్‌ రాచకొండకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చేలా ఉంటుంది. త్వరలోనే టీజర్, ప్రీ–రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నాం. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిన ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. రావు రమేశ్, షాయాజీ షిండే, వి.కె.నరేష్, రాజశ్రీ నాయర్, ప్రగతి, ఉత్తేజ్, దువ్వాసి మోహన్, సూర్య, గౌతమ్‌ రాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: డి.ఆర్‌.వెంకట్, సంగీతం–దర్శకత్వం: ప్రదీప్‌ కేకే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top