మైనస్‌ 20

Celebrities wish Mr Perfectionist  Aamir Khan on his BirthDay - Sakshi

... అంటే ఆమిర్‌ ఖాన్‌ వయసులో కాదు. పారితోషికంలో కోత కాదు. ఆయన బరువులో. ఇటీవల ఆమిర్‌  ఖాన్‌ నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీంతో ఆమిర్‌ఖాన్‌ తర్వాతి సినిమా ఏంటి? అనే చర్చ బాలీవుడ్‌లో బాగానే జరిగింది. ఈ చర్చకు తన పుట్టినరోజు (గురువారం)న ఫుల్‌స్టాప్‌ పెట్టారు ఆమిర్‌ ఖాన్‌. ఆరు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డు సాధించిన అమెరికన్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ హిందీ రీమేక్‌లో హీరోగా నటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చిత్రానికి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసుకున్నారు.

ఈ చిత్రానికి ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ ఫేమ్‌ అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తారు. ‘‘ఫారెస్ట్‌గంప్‌’ చిత్రకథ నాకెంతో ఇష్టం. సుస్థిరమైన జీవితానికి చెందిన కథ అది. ఈ సినిమా కోసం నేను బరువు తగ్గాలి. అతుల్‌ కులకర్ణి మంచి స్క్రిప్ట్‌ రాశారు. విన్నప్పుడు బాగా ఎగై్జటింగ్‌గా అనిపించింది’’ అని పేర్కొన్నారు అమిర్‌ ఖాన్‌. ఆమిర్‌ 20 కిలోల బరువు తగ్గనున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం అవుతుంది. ఇంతకీ ఆమిర్‌ ఖాన్‌ వయసు ఎంతో చెప్పలేదు కదూ. ఆయన 54వ వసంతంలోకి అడుగుపెట్టారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top