కళాశాలలో....

కళాశాలలో.... - Sakshi


కళాశాల నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా రూపొందనున్న చిత్రం ‘శరణం గచ్ఛామి’. నవీన్ సంజయ్, తనిష్క్ తివారి జంటగా ప్రేమరాజ్ దర్శకత్వంలో మురళి బొమ్మ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లక్ష్మీనర్సమ్మ కెమెరా స్విచాన్ చేయగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సమాజాన్ని ప్రతిబింబించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో ఓ సందేశం కూడా ఉంటుంది’’ అని  తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: జలదంకి సుధాకర్, సినిమాటోగ్రఫీ: కల్యాణ్ సమీ, సంగీతం: రవి కల్యాణ్.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top