కథ నచ్చితేనే సినిమాలు తీస్తా

కథ నచ్చితేనే సినిమాలు తీస్తా


బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘జయ జానకి నాయక’. రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ మొదలైంది. అల్లు అరవింద్‌గారు ‘కథను నమ్మి, మంచి సినిమా తీశావ్‌. నీకు మంచి భవిష్యత్‌ ఉంది’ అనడం సంతోషం కలిగించింది. టెక్నిషియన్స్‌ను నమ్ముతాను.బడ్జెట్‌ విషయంలో రాజీపడకుండా నిర్మించాను. ఇకపై నేను నిర్మించబోయే సినిమాల్లోనూ కథకి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తాను. కథ నచ్చితేనే సినిమాలు చేయాలనుకుంటున్నాను. బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్‌ సూపర్‌. ఆయన యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా తెరకెక్కించారు. ఫైట్‌ సీన్స్‌ చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు. సాయి శ్రీనివాస్‌ పర్ఫార్మెన్స్‌ బాగుంది. అతనికి లైఫ్‌ లాంగ్‌ గుర్తుండిపోయే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ సినిమాను మరో మెట్టు ౖపైకి ఎక్కించింది. బోయపాటిగారితో త్వరలోనే మరో సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.

Back to Top