బాలీవుడ్‌ తారల విద్యార్హతలు

Bollywood Star Educational Qualifications - Sakshi

ముంబై : తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి సినీ అభిమానులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారనే విషయం తెలిసిందే. సినిమాల్లో వారు పోషించే పాత్రలను నిజ జీవితంతో పోలుస్తూ కామెంట్లు చేస్తుంటారు. నిరంతరం తమ అభిమాన తారల కోసం నెట్టింట్లో వెతికే అభిమానులు వారి విద్యార్హతలు తెలుసకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కాగా, కొంత మంది బాలీవుడ్‌ అగ్ర తారలు హై క్వాలిఫికేషన్‌ కలిగి ఉన్నప్పటికీ.. మరికొంత మంది మాత్రం స్కూలింగ్‌తోనే చదువుకు స్వస్తి పలికారు. కొందరు నటీనటులకు సంబంధించిన విద్యార్హతలను పరిశీలిస్తే...

అమీర్‌ఖాన్‌...
బాలీవుడ్‌లో మిస్టర్‌ ఫర్‌పెక్ట్‌గా పేరొందిన ఆమిర్‌ఖాన్‌.. పలు చిత్రాల్లో సైంటిస్ట్‌ క్యారెక్టర్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవంగా మాత్రం ఆమిర్‌ కేవలం స్కూలింగ్‌ మాత్రమే పూర్తి చేశారు.

దీపికా పదుకోన్‌
డెన్మార్క్‌లో జన్మించిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌.. ఆ తర్వాత ఏడాదికే ఇండియాకు చేరారు. బెంగళూరులోని సోఫియా హై స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన దీపికా.. మౌంట్‌ కార్మెల్‌ కాలేజ్‌ ప్లస్‌ టూ చదివారు. ఆ తర్వాత చదువు వదిలిపెట్టి మోడలింగ్‌ వైపు అడుగులేసి.. సినీ పరిశ్రమలో ప్రవేశించారు.

ఆలియా భట్‌
బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆలియా భట్‌ స్కూలింగ్‌ కాగానే.. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంతో తానను తాను నిరూపించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

పరిణితీ చోప్రా
బ్యాంకింగ్‌పై ఇంట్రెస్ట్‌తో 17 ఏళ్ల వయస్సులో పరిణీతి చోప్రా లండన్‌ వెళ్లారు. అక్కడ మాంచెస్టర్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి బిజినెస్‌, ఫైనాన్స్‌, ఎకనామిక్స్‌ విభాగాల్లో ట్రిపుల్‌ డిగ్రీ సాధించారు.

జాన్‌ అబ్రహం
బాంబేలో స్కూలింగ్‌ పూర్తిచేసిన జాన్‌ అబ్రహం.. జై హిందూ కాలేజ్‌లో ఎకనామిక్స్‌ చదివారు. ముంబై ఎడ్యూకేషనల్‌ ట్రస్ట్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆ తర్వాత కొంతకాలం కార్పొరేట్‌ రంగంలో పనిచేసి.. మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు.

కరీనా కపూర్‌
స్కూలింగ్‌ తర్వాత కరీనా మితిబాయి కాలేజ్‌లో రెండు సంవత్సరాలు చదివారు. ఆ తర్వాత హర్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మూడు నెలల మైక్రో కంప్యూటర్స్‌ కోర్సు పూర్తి చేశారు. ముంబైలో లా కాలేజ్‌లో ఆమె చదువుకున్నారు. ఆ తర్వాత ఏడాదే ఆమె సినీ రంగంలోకి ప్రవేశించారు.

కత్రినా కైఫ్‌
హంకాంగ్‌లో జన్మించిన కత్రినా రెగ్యూలర్‌ స్కూల్‌కు వెళ్లలేక పోయారు. ఆమె కుటుంబం వివిధ దేశాలకు తిరగాల్సి రావడం వల్ల కత్రినా ఇంటి వద్దనే విద్యను అభ్యసించారు. తన 14వ ఏటనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన కత్రినా.. కాలేజ్‌కు కూడా వెళ్లలేదు.

ప్రియాంక చోప్రా
యూఎస్‌లో మూడు ఏళ్లు స్కూలింగ్‌ పూర్తి చేసిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత భారత్‌లో ఆర్మీ స్కూల్‌లో స్కూలింగ్‌ పూర్తి చేశారు. ముంబైలో కాలేజ్‌ విద్యను ప్రారంభించి మధ్యలోనే వదిలివేశారు. 2000 సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న ప్రియాంత తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top