గద్దలకొండ గణేష్.. ఎలిమినేట్‌ చేయబోయేది ఎవరిని?

Bigg Boss 3 Telugu: Varun Tej As Chief Guest In Ninth Weekend - Sakshi

నేటి బిగ్‌బాస్‌ షోను గద్దలకొండ అడ్డాగా మార్చేసినట్టు కనిపిస్తోంది. ‘గద్దలకొండ గణేష్‌’రాకతో బిగ్‌బాస్‌ స్టేజ్‌ గజ గజలాడిపోతోందేమో చూడాలి. మరి ఈయన వచ్చాడంటే.. ఎదుటోడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. మరి బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌తో వరుణ్‌ తేజ్‌ చేసే సందడి ఏంటో చూడాలి.

నేటి ఎలిమినేషన్‌ వరుణ్‌ అలియాస్‌ గద్దలకొండ గణేష్‌ చేతుల మీదుగా జరనున్నట్లు తెలుస్తోంది. మర్చిపోతానని ఓ చీటి రాసుకుని వచ్చాడంటా? మరి ఆ చీటిలో ఏ పేరు ఉందో హౌస్‌మేట్స్‌కు తెలియకపోయినా.. బయటున్న ప్రేక్షకులకు మాత్రం తెలుసు. ఇప్పటికే హిమజ ఎలిమినేట్‌ అయిపోయిందంటూ.. వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎలిమినేట్‌ అయిన హిమజ హౌస్‌మేట్స్‌ గురించి ఏం చెబుతుందో చూడాలి.

వరుణ్‌ తేజ్‌ ముఖ్య అతిథిగా వచ్చిన నేటి షోలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓ రేంజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేసినట్టు తాజాగా రిలీజ్‌చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. పునర్నవి ప్రపోజ్‌ చేయడానికి తడబడుతుంటే.. వరుణ్‌ వేసిన పంచ్‌కు అందరూ పగలబడి నవ్వారు. వరుణ్‌పై హిమజ చెప్పిన ప్రాసకు పడిపడి నవ్వారు. శ్రీముఖిపై వేసిన పంచ్‌, బాబా భాస్కర్‌ డ్యాన్సులు, హౌస్‌మేట్స్‌తో వరుణ్‌ చేసిన సందడిని చూడాలంటే ఇంకాసేపు ఆగాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top