బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

Bigg Boss 3 Telugu Is At Top In TRP Rating - Sakshi

తెలుగునాట ఏ ఇంట్లో చూసినా ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్‌ మీడియా సంగతి చెప్పనక్కర్లేదు. తమ అభిమాన కంటెస్టెంట్ల పేరిట పేజీలు నడిపిస్తూ మద్దతు తెలుపుతున్నారు. దాదాపు ఇంటి సభ్యులందరికీ సపరేట్‌ సైన్యం ఉంది. ఆర్మీల పేరిట ఎవరికి వారు తమ అభిమాన కంటెస్టెంట్ల తరుపున చాటింపు వేసుకుంటున్నారు. ఇక ఈ రేంజ్‌లో బిగ్‌బాస్‌ గురించి చర్చ జరగుతూ ఉంటే.. టీఆర్పీ ఎక్కడికో వెళ్లి కూర్చుండదూ. 

టీఆర్పీ రేటింగ్‌ విషయంలో, నగరంలో ఈ షో రేటింగ్‌, బిగ్‌బాస్‌ను వీక్షించే వారి సంఖ్య, వారం రోజులపాటు ట్రెండ్‌ ఎలా కొనసాగిందే ఓ రిపోర్ట్‌​ వచ్చేసింది. వాటిని గమనిస్తే.. నిజంగానే ఈ షో రికార్డులకే ‘బిగ్‌బాస్‌’ అనేట్టు ఉంది. మొదటి రోజు 17.9తో టాప్‌లో దూసుకుపోగా.. హైదరాబాద్‌లో  19.7తో రికార్డు సృష్టించింది. మొత్తంగా 4.5కోట్ల మంది వీక్షించినట్లు ప్రకటించారు. మొదటి వారాన్ని దాదాపు 60శాతం మంది, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షోను 44 శాతం వీక్షించినట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో మొదటి రోజు వరల్డ్‌ వైడ్‌ ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వన్‌ మిలియన్‌ ట్వీట్స్‌, లైక్స్‌, హ్యాష్‌ట్యాగ్‌లు ఇలా అన్నింటిని కలుపుకుని ట్విటర్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్‌ రాగా, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఫస్ట్‌ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది. వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టిన నాగ్‌ తొలి ఎపిసోడ్‌కు 17.9 రేటింగ్‌ సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top