రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

Bigg Boss 3 Telugu Rohini Eliminated And Shiva Jyothi Cried - Sakshi

అనుకున్నట్లే జరిగింది. అందరూ ఊహించినట్లే రోహిణి ఎలిమినేట్‌ అయింది. అయితే ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో జంటగా వెళ్లిన శివజ్యోతి, రోహిణిలు ఒక్కతాటి పైకి వచ్చి శివజ్యోతి నామినేట్‌ కానున్నట్లు ప్రకటించారు. దీంతో రోహిణి సేవ్‌ అయినందుకు సంతోషపడింది. అయితే ఆ సంతోషం పది నిమిషాల్లోనే ఆవిరైపోయింది. నామినేషన్‌ ప్రక్రియ గురించి చర్చిండం అనే నియమాన్ని ఉల్లంఘించినందుకు గానూ బిగ్‌బాస్‌ రోహిణిని నేరుగా నామినేట్‌ చేశాడు. (బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!)

అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారందరిలో రోహిణి కాస్త తక్కువ ఫేమ్‌ ఉండటం, హౌస్‌లో ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేకపోవడం, ఎక్కువగా హైలెట్‌ కాకపోవడంతో ఓటింగ్‌లో తేడా కొట్టేసింది. దీంతో నామినేషన్స్‌లోకి వచ్చిన మొదటిసారే.. ఇంటి నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఓ రకంగా రోహిణి నామినేషన్‌కు తానే కారణమని శివజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది. (బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!)

ఈ సండే నిజంగా ఫన్‌డే అయింది. డైలాగ్‌లతో బిగ్‌బాస్‌ హౌస్‌ మార్మోగిపోయింది.  ఆటలతో, మాటలతో బిగ్‌బాస్‌ హౌస్‌ సందడిగా సాగింది. మాస్క్‌లు తీసేశారా లేదా అని హౌస్‌మేట్స్‌కు ఓ టాస్క్‌ ఇచ్చాడు నాగార్జున. నామినేషన్స్‌లో ఉన్నవారందరినీ అక్యూజ్డ్‌ టీమ్‌, వరుణ్‌ సందేశ్‌, శివజ్యోతి, అలీరెజాలను జడ్డిలుగా విడగొట్టి, మిగతా హౌస్‌మేట్స్‌ను ప్రాసిక్యూట్‌ టీమ్‌లుగా విడగొట్టాడు. అనంతరం అక్యూజ్డ్‌ టీమ్‌ మెంబర్స్‌ హౌస్‌లో ఎందుకు ఉండకూడదో వాదించాలని, అయితే ప్రాసిక్యూషన్‌ టీమ్‌ వారి ముసుగు తీసి వాదించారా? లేదా అన్నది జడ్జెస్‌ టీమ్‌ మెంబర్స్‌ చెప్పాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ ఆటలో మహేష్‌-బాబా భాస్కర్‌, పునర్నవి-రాహుల్‌, హిమజ-శ్రీముఖి, అషూ రెడ్డి-రోహిణి, వితికా షెరు-రవికృష్ణలు వాదనలు వినిపించారు. ఈ టాస్క్‌లో రాహుల్‌-పునర్నవి, బాబా భాస్కర్‌-మహేష్‌ వాదనలు ఫన్‌ క్రియేట్‌ చేశాయి.

ఇక హౌస్‌మేట్స్‌తో మారో డైలాగ్‌ అంటూ మరో ఆట ఆడించాడు. హౌస్‌మేట్స్‌ అందరికీ ఒక్కో డైలాగ్‌ను ఇచ్చి.. విలన్‌ అని భావించేవారికి చెప్పండని తెలిపాడు. ఈ ఆటలో హౌస్‌మేట్స్‌ తమ మనసులోని భావాలను బయటపెట్టారు.  మహేష్‌-పునర్నవి, రాహుల్‌-శ్రీముఖి, శివజ్యోతి-పునర్నవిల మధ్య ఉన్న కోల్డ్‌వార్‌ ఈ మారో డైలాగ్‌తో బయటకు వచ్చింది. ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో భాగంగా శ్రీముఖి, బాబా భాస్కర్‌, రవికృష్ణ సేవ్‌ అయినట్లు నాగార్జున తెలిపాడు. రోహిణి ఎలిమినేట్‌ కావడంతో శివజ్యోతి కన్నీరును ఆపుకోలేకపోయింది.

బయటకు వచ్చిన రోహిణి.. హౌస్‌మేట్స్‌ అందరికీ మార్కులు వేసింది. అలీకి వందకు వంద మార్కులు వేయగా.. బాబా భాస్కర్‌కు వందకు వెయ్యి మార్కులు వేసింది. మహేష్‌, శ్రీముఖికి 50 మార్కులు వేసింది. శ్రీముఖి బయట అందరితో సరదాగా ఉన్నట్లు బిగ్‌బాష్‌ హౌస్‌లో అలా ఉండటం లేదని ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తూ ఉంటుందని తెలిపింది. గొడవలను పెంచడానికి ప్రయత్నిస్తాడు తప్ప తగ్గించాలని మహేష్‌ చూడడని పేర్కొంది. రవికృష్ణకు 95, అషూకు 99 మార్కులు వేసింది. అనవసరంగా నామినేషన్స్‌లోకి వచ్చి ఇంటి దారి పట్టింది రోహిణి. ఇక ఐదో వారంలో బిగ్‌బాస్‌ ఎలా ఉండబోతోందో? ఎవరు నామినేషన్స్‌కు వెళ్లనున్నారో? తెలియాలంటే బిగ్‌బాస్‌ చూస్తూ ఉండాల్సిందే.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

17-09-2019
Sep 17, 2019, 13:23 IST
తొమ్మిదో వారానికిగానూ బిగ్‌బాస్‌ చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. గత సీజన్‌లో మాదిరిగానే నిర్వహించిన బిగ్‌బాస్‌ కొన్ని మార్పులు...
17-09-2019
Sep 17, 2019, 11:38 IST
బిగ్‌బాస్‌ సెకండ్‌ సీజన్‌ పాపులర్‌ కావడానికి ముఖ్య కారణమైన కంటెస్టెంట్‌ కౌశల్‌. హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడో.....
17-09-2019
Sep 17, 2019, 11:07 IST
గత సీజన్లలో వచ్చిన నామినేషన్‌ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌ మక్కీకి మక్కీ దించాడు. ఇక ఇంటిసభ్యులందరూ ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడానికి అరక్షణమైనా ఆలోచించకుండా ఒకరికోసం...
17-09-2019
Sep 17, 2019, 10:01 IST
ఎనిమిది వారాలను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేసింది. అయితే ఇప్పటివరకు ఏడు ఎలిమినేషన్స్‌, రెండు...
17-09-2019
Sep 17, 2019, 08:34 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం...
16-09-2019
Sep 16, 2019, 22:50 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారంలో చేపట్టిన నామినేషన్‌ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠగా మారింది.  ఈ క్రమంలో గార్డెన్‌ ఏరియాలో ఓ...
16-09-2019
Sep 16, 2019, 20:06 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో తొమ్మిదో వారానికి గానూ చేపట్టే నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ వారంలో ఎవరు నామినేషన్స్‌లోకి...
16-09-2019
Sep 16, 2019, 18:05 IST
గత సీజన్‌లో ఇచ్చిన టాస్క్‌లనే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. రెండో సీజన్‌లో  నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా...
16-09-2019
Sep 16, 2019, 17:21 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో.. నామినేషన్‌లో ఉండటం అనేది ఎంతటి వారికైనా కునుకు లేకుండా చేస్తుంది. హౌస్‌మేట్స్‌లో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు...
15-09-2019
Sep 15, 2019, 22:23 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వీకెండ్‌ సందడిగా గడిచింది. వీకెండ్‌లో వచ్చిన నాగ్‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు....
15-09-2019
Sep 15, 2019, 20:26 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం గడిచిపోయేందుకు వచ్చేసింది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో అందరి లెక్కలు సరిచేసిన నాగ్‌.. విశ్వరూపం చూపించాడు....
14-09-2019
Sep 14, 2019, 22:58 IST
బిగ్‌బాస్‌ను ఎదురించిన పునర్నవి, మహేష్‌లపై నాగ్‌ ఫైర్‌ అవ్వడం, శ్రీముఖికి వార్నింగ్‌ ఇవ్వడం, టాస్క్‌లను అర్థం చేసుకుని ఆడాలని శిల్పాకు...
14-09-2019
Sep 14, 2019, 19:33 IST
బిగ్‌బాస్‌ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఇచ్చాడో కానీ హౌస్‌ మొత్తం గందరగోళంగా మారింది. దెయ్యాలు...
14-09-2019
Sep 14, 2019, 19:06 IST
బిగ్‌బాస్‌లో ఎనిమిదో వారం సందడిగానే గడిచింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ ఒకెత్తు...
14-09-2019
Sep 14, 2019, 17:07 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారంలో కొందరు ఇంటిసభ్యులు తిరుగుబాటు చేశారు. బిగ్‌బాస్‌ ఆదేశాలనే ధిక్కరించారు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
14-09-2019
Sep 14, 2019, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ అనేది ఎంత ఉత్కంఠగా సాగాల్సి ఉంటుందో.. అందుకు భిన్నంగా జరుగుతూ వస్తోంది. మొదటి వారం...
13-09-2019
Sep 13, 2019, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో శుక్రవారం నాటి ఎపిసోడ్‌ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్‌ ఐటమ్స్‌ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్‌ లభించాయి....
13-09-2019
Sep 13, 2019, 18:00 IST
అవును మహేష్‌ను బిగ్‌బాస్‌ ఎలిమినేట్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఇంటి సభ్యులందరూ నమ్మేలా మహేష్‌ సీక్రెట్‌ టాస్క్‌ చేయాలి. అసలే...
13-09-2019
Sep 13, 2019, 17:08 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో అన్నింటికంటే కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లడం కష్టమైంది. ఇంటిసభ్యులకు ఏదైనా పనిష్మెంట్‌ ఇవ్వాలన్నా.. సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వాలన్నా.. అలాంటి...
13-09-2019
Sep 13, 2019, 16:17 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top