బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘జంబలకిడిపంబ’

Bigg Boss 3 Telugu Power Game Task - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంతవరకు ఇచ్చిన టాస్క్‌ల్లో ఒకరినొకరు కొట్టుకుని పైచేయి సాధించేలా ఎలాంటి టాస్క్‌లు ఇవ్వలేదు. హౌస్‌మేట్స్‌ అందరూ తన్నుకు చచ్చేలా, బలాన్ని ప్రదర్శించే దిశగా ఒక్క పరీక్షను పెట్టలేదు. అయితే నేటి ఎపిసోడ్‌లో అలాంటి ఓ టాస్క్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. గార్డెన్‌ ఏరియాలో ఉన్న కిరీటాన్ని మొదట ఎవరు పట్టుకుంటే.. వారికి మిగతా సభ్యులపై అధికారం చెలాయించే పవర్‌ వస్తుందని ఇది పవర్‌ గేమ్‌ అంటూ బిగ్‌ టాస్క్‌ను ఇచ్చాడు. 

ఇక ఈ టాస్క్‌లో ఎవరి ఎవరిని తోసుకుంటూ వెళ్తారు? ఎవరికి గాయాలవుతాయి? ఎవరెవరి మధ్య గొడవలు జరుగుతాయో? ఆ కిరీటాన్ని మొదట ఎవరు పట్టుకున్నారో? ఎవరికి పవర్‌ వచ్చిందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. ఇక నేడు బిగ్‌బాస్‌ హౌస్‌లో జంబలకిడిపంబ చూడబోతోన్నట్లు తెలుస్తోంది. దీంట్లో మగవారు ఆడవారుగా.. ఆడవారు మగవారుగా మారి సరదాగా ఆడిపాడుకుంటున్నారు. ఇలా టాస్క్‌లతో నేటి ఎపిసోడ్‌ రసవత్తరంగా ఉన్నట్లు తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలా ద్వారా తెలుస్తోంది.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top