బిగ్‌బాస్‌: ఈసారి మామూలుగా ఉండదు!

Bigg Boss 3 Telugu Housemates Entertainment With King Nagarjuna - Sakshi

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులు దసరా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వీకెండ్‌లో చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెట్టింపు నేటి ఎపిసోడ్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. స్పెషల్‌ గెస్ట్‌గా ఇంట్లో అడుగుపెట్టిన నాగ్‌ ఇంటిసభ్యులతో ఫన్నీ టాస్క్‌లు ఆడిస్తున్నాడు. వచ్చీరావడంతోనే వారికి స్వీట్లు తినిపించడమే కాకుండా గిఫ్ట్స్‌ కూడా అందజేశారు. దీంతో ఇంటిసభ్యులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఇక హౌస్‌మేట్స్‌ చేసే అల్లరి మామూలుగా లేదు. వారి ఆటపాటలతో జోష్‌ ఓ రేంజ్‌కి వెళ్లిపోయింది.

తాజా ప్రోమో ప్రకారం ఇంటిసభ్యులు ఓ ఫన్నీ టాస్క్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బెలూన్లను ఊదటం వరకే మనకు తెలుసు.. కానీ అందుకు భిన్నంగా బెలూన్లలో ఉన్న గాలిని హౌస్‌మేట్స్‌ పీల్చాలి. అంతేనా.. అక్కడితో ఆగకుండా పీల్చుకున్న గాలిని బయటికి వదిలేయకుండా డైలాగ్‌ లేదా పాటలు పాడాలి. అందుకు వాళ్లు పడుతున్న కష్టాలు, వారి చేష్టలు నవ్వు తెప్పించకుండా ఉండవు. ఇక నేటి ఎపిసోడ్‌ జనాలకు మంచి కిక్‌ ఇవ్వనుందా అనేది చూడాలి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top