బిగ్‌బాస్‌లో మెరవనున్న హీరోయిన్‌

Bhojpuri Actress Rani Chatterjee To Enter Salman Khans Bigg Boss - Sakshi

ముంబై : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా రూపొందే రియాలిటీ​ షో బిగ్‌బాస్‌ 13 సిరీస్‌లో భోజ్‌పురి నటి రాణి ఛటర్జీ కంటెస్టెంట్‌గా పాల్గొంటారు. భోజ్‌పురి సినీ పరిశ్రమలో పెద్దమొత్తంలో పారితోషికం తీసుకునే నటివగా గుర్తింపు పొందిన రాణి ఛటర్జీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా భారీ మొత్తం డిమాండ్‌ చేసినట్టు సమాచారం. రాణి ఛటర్జీని బిగ్‌బాస్‌ షోలో దింపేందుకు షో నిర్వాహకులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఆమె బిజీ షెడ్యూల్‌ కారణంగా ఇది సాధ్యపడలేదు.

ఇక బిగ్‌బాస్‌ తాజా సీజన్‌లో పాల్గొనేందుకు ఆమె కసరత్తు ప్రారంభించిందని రోజూ జిమ్‌కు వెళ్లి చెమటోడుస్తోందని తెలిసింది. బిగ్‌బాస్‌ సెట్‌లో సరికొత్త లుక్‌తో వెళ్లాలని రాణి ఛటర్జీ పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. కాగా గత 13 ఏళ్లుగా బిగ్‌బాస్‌ షోలో మనోజ్‌ తివారీ, రవికిషన్‌, సంభావన సేఠ్‌, మొనాలిసా వంటి పలువురు భోజ్‌పురి తారలు కంటెస్టెంట్‌లుగా ప్రాచుర్యం పొందారు. మరోవైపు రాణీ ఛటర్జీతో పాటు రానున్న సీజన్‌లో జరీన్‌ ఖాన్‌, కమెడియన్‌ సిద్ధార్ధ్‌ సాగర్‌, హిమాన్షు కోహ్లి, దొనల్‌ బిస్త్‌లు పాల్గొంటారని సమాచారం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top