ఇక స్వస్తేనా!

Anushka Shetty marriage Trials In Home - Sakshi

సినిమా:  అందాల బామ అనుష్కకు నటిగా ఇక కథ ముగిసినట్లేనా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో రేకెత్తిస్తోంది. 2005లో తెలుగులో సూపర్‌ చిత్రం ద్వారా పరిచయమైన కన్నడ భామ అనుష్క. రెండు అనే చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతై తడితడి అందాలతో యువతను కిర్రెక్కించింది. ఆ చిత్రం కూడా విజయాన్ని అందుకోలేదు. అయినా అనుష్కకు టాలీవుడ్‌లో అవకాశాలు వరించాయి. అరుంధతి చిత్రం ఈ బ్యూటీని అందలం ఎక్కించేసింది. ఆ తరువాత హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకు అనుష్క చిరునామాగా మారింది. చారిత్రక కథా చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి సిరీస్, మధ్యలో స్టార్‌ హీరోలతో కమర్షి యల్‌ కథా చిత్రాలు అంటూ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇదిలా ఉండగా అనుష్క, నయనతార మధ్యనే పోటీ నెలకొంది.

అనుష్క నటించిన చివరగా చిత్రం భాగమతి. జనవరిలో తెరపైకి వచ్చి విజయాన్ని అందుకుంది. తరువాత అనుష్క మరో చిత్రం చేయలేదు. ఆ మధ్య గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు అనుష్కనే స్వయంగా చెప్పింది. అయితే ఆ తరువాత ఆ చిత్రం ఊసే లేదు. ఇటీవల నటుడు మాధవన్‌తో జత కట్టడానికి రెడీ అవుతుందనే ప్రచారం జరిగింది. దాని గురించి ప్రకటన లేదు. ఇలాంటి సమయంలో అనుష్క నటనకు స్వస్తి చెప్పనున్నట్లు, 36 ఏళ్ల ఈ బొద్దుగుమ్మకు ఇంట్లో పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ మధ్య వివిధ ఆలయాల్లో అనుష్క దోష నివారణ పూజలు కూడా నిర్వహించారు. దీంతో ఇక అంతే అనుష్క నటనకు స్వస్తే అనే ప్రచారం ఊపందుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top