సంక్రాంతి బరిలో స్వీటీ

Anushka Bhagamathi  to join Sankranthi race - Sakshi

2018 సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తో పాటు నటసింహం బాలకృష్ణలు సంక్రాంతి బెర్తు కన్ఫమ్‌ చేసుకున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా కాస్త అటు ఇటుగా బరిలో దిగేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఇంత భారీ పోటీలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా కూడా  తలపడేందుకు రెడీ అవుతుందట. అనుష్క లీడ్‌ రోల్‌లో పిల్ల జమీందార్‌ ఫేం అశోక్‌ దర్శకత్వంలో భాగమతి అనే సినిమాను తెరకకెక్కిస్తున్నారు.

అరుంధతి తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా రోజులుగా షూటింగ్‌ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో చిత్రయూనిట్‌ ఓ నిర్ణయానికి వచ్చారాట. అన్ని కార్యక్రమాలను పూర్తి సంక్రాంతి కానుకగా భాగమతిని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, మలయాళ నటుడు ఉన్నిముకుందన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top