అప్పట్లో అదే నా అలవాటు : అనుపమ

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్లో ఉంటుందో చెప్పలేం. ఇక వీటిలో సెలబ్రెటీలు చేరడంతో అవి ఇంకా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో 10yearchallenge నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కొందరికి ఎదురుదెబ్బలు కూడా తగులుతున్నాయి.
ఏది ఏమైనా సరే ఈ చాలెంజ్ మాత్రం ముందుకు సాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ చాలెంజ్లోకి కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరణ్ చేరిపోయారు. పదేళ్ల కిత్రం చీరలో ఉన్న ఫోటోను, ప్రస్తుతం చీరలో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. అమ్మ పర్మిషన్ లేకుండానే.. ఆమె చీరలు కట్టుకోవడమే అప్పట్లో నాకు ఉన్న అలవాటు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. రీసెంట్గా అనుపమ ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాతో అభిమానులను పలకరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి