పెళ్లికి సిద్ధం అవుతున్న హీరోయిన్‌ అంజలి!

Anjali Gets Angry Over Love Matter - Sakshi

చెన్నై: హీరోయిన్‌ అంజలికి కోపం వచ్చింది. సాధారణంగా ఏ విషయానైనా ఈజీగా తీసుకునే ఈ బ్యూటీ... అపుడెప్పుడో పిన్నితో మనస్పర్థలు వచ్చినప్పుడు కూడా ఆవేదన చెందిందేగానీ అంతగా ఆగ్రహం చెందలేదు. అంజలి చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది గానీ, తమిళ చిత్రాలకూ దూరం కాలేదు. ఇప్పటికీ తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూనే ఉంది. రెండు భాషల్లోనూ నటిగా మంచి పేరును సంపాదించుకుంది. ఇటీవల మమ్ముట్టితో నటించిన పేరన్భు చిత్రం విమర్శలకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తమిళంలో మూడు చిత్రాలతో బిజీగా ఉంది. వాటిలో శశికుమార్‌తో జతకట్టిన నాడోడిగళ్‌–2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇకపోతే వ్యక్తిగత విషయాల గురించి చెప్పాలంటే ఆ మధ్య నటుడు జైతో చెట్టాపట్టాల్‌ అంటూ ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ వంటింటి వరకూ వెళ్లి దోసెలు వేసుకుని తింటూ మీడియాలోనూ హెడ్‌లైన్‌లో కెక్కారు.

అలాంటిది ఆ తరువాత వీరిద్దరి మధ్య ఏమైందో గానీ, తమ మధ్య ప్రేమ లేదు, దోమ లేదు అంటూ బహిరంగంగానే చెప్పేశారు. నటుడు జై కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇప్పటికీ సింగిలే అని చెప్పాడు. ఇక తాజా విషయానికి వస్తే  అంజలి ఒక నటుడితో ప్రేమలో పడిందని, త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతోందని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు పెళ్లి తరువాత నటనకు టాటా చెప్పనుందనేది వైరల్‌ అవుతోంది. ఇక్కడే అంజలికి ఆగ్రహం కట్టలు తెంచుకుందని సమాచారం.

ఈ సందర్భంగా అంజలి స్పందిస్తూ, వివాహమైన నటీమణులే తిరిగి నటించడానికి రెడీ అవుతుంటే తానెందుకు నటనకు గుడ్‌బై చెప్పాలి? అని ప్రశ్నించింది. అయినా తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎవరు చెప్పారు? అంటూ కస్సుబుస్సు లాడింది. నిజానికి తనకిప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదని, ఒక వేళ వివాహం చేసుకున్నా, నటనకు దూరం కానని స్పష్టం చేసింది. అయితే తాను ప్రేమలో పడ్డ విషయం గురించి క్లారిటీ ఇవ్వలేదు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top