బాలయ్యతో చిత్రం.. కథ సిద్దం చేసిన అనిల్‌?

Anil Ravipudi To Direct Balakrishna Next Telugu Movie After F3 - Sakshi

లాక్‌డౌన్‌ సమయాన్ని దర్శకరచయితలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు.  అనూహ్యంగా దొరికిన ఈ సమయంలో వరుసగా కథలను సిద్దం చేసుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్‌ను సిద్దం చేసిపెట్టుకుంటున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. లాక్‌డౌన్‌ విధించడానికి ముందే తన బృందంతో కలిసి సొంతూరుకు మకాం మార్చాడు అనిల్‌.  ఇప్పటికే ‘ఎఫ్‌3’కి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్‌ను రెడీ చేసి పెట్టారని టాక్‌. 

ఈ క్రమంలోనే తన అభిమాన హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ కోసం ఓ కథను సిద్దం చేశారని సమాచారం. బాలయ్యతో సినిమా తీయాలని ఈ యువ డైరెక్టర్‌ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నందమూరి హీరో వందో చిత్రాన్ని డైరెక్ట్‌ చేయాలని అనిల్‌ భావించినప్పటికీ కుదర్లేదు. అయితే తాజాగా బాలయ్య కోసం అనిల్‌ ఓ పవర్‌ఫుల్‌ కథ, స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్‌ ముగియగానే బాలయ్యకు కథ వినిపించనున్నారని టాలీవుడ్‌ టాక్‌. ఇక అన్ని కుదిరితే ‘ఎఫ్‌3’ తర్వాత బాలయ్య చిత్రాన్ని పట్టాలెక్కించాలని అనిల్‌ రావిపూడి యోచిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరి బాలయ్యతో ఎలాంటి జోనర్‌లో, ఏ కథతో అనిల్‌ సినిమా తీస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

చదవండి:
‘రేసుగుర్రం’ రిపీట్‌ కానుందా?
హీరోయిన్‌ మెటీరియల్‌ కాదన్నారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top