శేఖర్‌కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘అనామిక’

శేఖర్‌కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం  ‘అనామిక’

చూడటానికి పూర్ణ గర్భవతి. చుట్టూ ‘నా’ అనేవాళ్లు లేరు. మహానగరంలో తనో ఒంటరి. గుండెలో ఊహకందని బడబాగ్నిని దాచుకున్న ఆ ‘అనామిక’ కళ్లు ఎవరికోసమో అమాయకంగా అన్వేషిస్తు న్నాయి. ఇంతకీ ఎవరా అనామిక? ఆ కళ్లు ఎవరికోసం వెతుకుతున్నాయి? భావోద్వేగపూరితమైన ఈ కథాంశంతో శేఖర్‌కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం  ‘అనామిక’. టైటిల్ రోల్ నయనతార పోషిస్తున్నారు. 

 

 ఎండేమోల్ ఇండియా, లాగ్‌లైన్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. హైదరాబాద్‌లోని ముర్గి మార్కెట్, చూడి బజార్, సుల్తాన్ బజార్, చార్మినార్, బేగమ్ బజార్ ప్రాంతాల్లో జనసంచారం మధ్య ఎంతో రిస్క్ చేసి చిత్రీకరణ జరుపుతున్నారు శేఖర్‌కమ్ముల.  తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానిని శేఖర్‌కమ్ముల సన్నాహాలు చేస్తున్నారు. 

 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘సినిమా మాధ్యమంపై మరింత ప్రేమను పెంచిందీ సినిమా. చిత్రీకరణ జరుపుతున్న కొలదీ ఈ కథపై మమకారం రెట్టింపవుతోంది. ఇందులోని పాత్రలన్నీ మన మధ్య మసిలేవే. నా కెరీర్‌లో ఎంతో కష్టపడి చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. ‘‘కేవలం అయిదు చిత్రాలతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అత్యంత ప్రతిభాశాలి శేఖర్ కమ్ముల. 

 

 ఆయన దర్శకత్వంలో నటిస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. స్త్రీ ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఛాలెంజ్‌గా తీసుకొని ఈ పాత్ర చేస్తున్నాను. ఇందులో నా నటనను, నా కొత్త రూపాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నా నమ్మకం’’ అని నయనతార చెప్పారు.

 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top