నడుము కిందకు చీర కడితే!?

Amala Paul Didn't Expect Buzz Around Hot Her Navel - Sakshi

కొంచెం నడుము కిందకు చీర కడితే... ఏమవుతుంది? అమ్మాయి/మహిళ నాభి కనిపిస్తుంది. ఆ నాభి చుట్టూ నానా హంగామా, రచ్చ జరుగుతాయని అస్సలు ఊహించలేదంటున్నారు అమలా పాల్‌. ఉన్నట్టుండి ఈ హీరోయిన్‌ చీరకట్టు గురించి, నాభి గురించి ఎందుకింత మాట్లాడుతున్నారు? అంటే... తమిళంలో బాబీ సింహాకు జోడీగా ‘తిరుట్టుపయలే–2’ సినిమా చేస్తున్నారు అమలా పాల్‌. తెలుగులో ‘దొంగోడొచ్చాడు’ పేరుతో అనువాదమవుతోందీ సినిమా. మొన్నీ మధ్యే ఫస్ట్‌ లుక్‌ (పసుపు రంగు చీరలో) విడుదల చేశారు. అందులో అమలా పాల్‌ చీరకట్టు వివాదాస్పదమైంది. బోల్డంత రచ్చ జరిగింది. దానిపై అమలా పాల్‌ స్పందిస్తూ– ‘‘నిజంగా... నా నాభి సినిమాకు ఇంత ప్రచారం తీసుకొస్తుందని, ఎంతో రచ్చ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు ప్రతిదీ ఎక్స్‌పోజర్‌ అవుతోంది. అలానే, మనం 2017లో ఉన్నామనే సంగతి మరువకూడదు. కొన్ని అంశాలను లైట్‌ తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఈ వివరణ విన్నోళ్లు బట్టల్లోనే కాదు, మాటల్లోనూ ఘాటు చూపిస్తున్నారీ బ్యూటీ అంటున్నారు!!
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top