అలకనంద?

Allu Arjun - Trivikram film titled Alakananda? - Sakshi

దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమా టైటిల్స్‌కు క్లాస్‌ టచ్‌ ఉంటుంది. అల్లు అర్జున్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. తాజాగా ఈ సినిమాకు ‘అలకనంద’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు ‘నాన్న–నేను’ అనే టైటిల్‌ తెరపైకి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

అయితే గత ఐదేళ్లలో ఒక్క ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ (2015) సినిమా టైటిల్‌ మినహా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది (2013), ‘అఆ’(2016), అజ్ఞాతవాసి (2018), అరవిందసమేత వీరరాఘవ (2018)’ సినిమాలన్నీ ‘అ’ అక్షరంతోనే ప్రారంభం కావడంతో తాజా సినిమాకు ‘అలకనంద’ అనే టైటిల్‌ నిజమే అన్న ఆలోచనలకు బలం చేకూరినట్లయింది. ‘జులాయి (2012), సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాల తర్వాత త్రివిక్రమ్‌–అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 24న ప్రారంభం కానుంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top