కథ విన్నారు.. కన్ఫార్మ్‌ చేయాలి!

Allu Arjun to team up with Dil Raju in his next - Sakshi

‘‘నా ప్రియమైన అభిమానులారా. మీరు నా మీద కనబరుస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తర్వాతి సినిమా అనౌన్స్‌మెంట్‌ కోసం ఇంకొన్ని రోజులు ఆగాలని కోరుకుంటున్నాను. ఒక మంచి సినిమా ఇవ్వాలనే ప్రయత్నం మీద ఉన్నాను. అందుకే టైమ్‌ పడుతోంది’’ అని ఇటీవల అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. అన్నట్లుగానే మంచి సినిమా ఇవ్వాలనే పట్టుదలతో కథలు వింటున్నారు. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్‌కు ‘దిల్‌’ రాజు ఓ కథ వినిపించారట. కథ విని బన్ని కూడా ఇంప్రెస్‌ అయ్యారని టాక్‌. ఒకవేళ అల్లు అర్జున్‌ ఇదే కథను కన్ఫార్మ్‌ చేస్తే.. ఆయన నెక్ట్స్‌ చిత్రం ‘దిల్‌’ రాజు బ్యానర్‌లోనే ఉంటుందని ఊహించవచ్చు. ఈ కథకు ఇంకా దర్శకుడిని అనుకోలేదట. ‘దిల్‌’ రాజు చెప్పిన ఈ కథకు ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని ఔత్సాహికరాయుళ్ల కథనాలు. గతంలో ఇదే టైటిల్‌ మరో హీరో చిత్రానికి వినిపించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top