బన్నీకి జోడిగా..!

Allu Arjun To Romance Rashmika Mandanna - Sakshi

ఛలో సినిమాతో టాలీవుడ్ పరిచయం అయిన అందాల భామ రష్మిక మందన్నా. తొలి సినిమాతోనే సూపర్‌ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్‌ గా మారిపోయింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇన్నాళ్లు యంగ్ హీరోలతో జత కడుతున్న ఈ భామ త్వరలో ఓ స్టార్ హీరోతో జోడి కడుతోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం రెడీ అవుతున్న అల్లు అర్జున్‌, తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నటిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు బన్నీ. ఎమ్‌సీఏ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు కనబడుటలేదు అనేది ట్యాగ్‌ లైన్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top