వరుస సినిమాలతో బన్నీ బిజీ

Allu Arjun Given a Nod to Star in Three Movies - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ లాంగ్ గ్యాప్‌ తీసుకున్నాడు. ఆ సినిమా డిజాస్టర్‌ కావటంతో తదుపరి ప్రాజెక్ట్స్‌ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఈ గ్యాప్‌లో బన్నీతో సినిమా అంటూ చాలా మంది దర్శకుల పేర్లు తెర మీదకు వచ్చినా ఫైనల్‌ గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు బన్నీ.

త్రివిక్రమ్ మూవీ తరువాత వరుస సినిమాలతో అలరించేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు స్టైలిష్‌ స్టార్‌. లెక్కల మాస్టార్‌ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు బన్నీ. అంతేకాదు చాలా రోజులుగా చర్చల్లో ఉన్న విక్రమ్‌ కుమార్‌ సినిమా కూడా లైన్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలతో పాటు త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ విషయంలో కూడా బన్నీ కీలక ప్రకటన చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top