సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న త్రివిక్రమ్‌!

Allu Arjun And Trivikram Srinivas Movie Titled Alakananda - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌, ఇటీవల తన కొత్త సినిమాను ప్రారంభించాడు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్ తో రూపొందుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమాకు ‘నాన్న నేను’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్టుగా ప్రచారం జరిగింది.

తాజాగా మరో టైటిల్‌ తెర మీదకు వచ్చింది. బన్నీ కొత్త సినిమాకు ‘అలకనంద’ అనే పేరును పరిశీలిస్తున్నారట. టైటిల్ త్రివిక్రమ్‌ స్టైల్‌లో క్లాస్ గా ఉండటంతో ఇదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ సెంటిమెంట్‌తో చాలా హిట్స్ కొట్టిన త్రివిక్రమ్, బన్నీ సినిమాకు కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top