బన్నీ మొదలెట్టేశాడు..!

Allu Arjun And Trivikram Srinivas Movie Pooja Ceremony - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్‌, ఈ రోజు (శనివారం) తన తదుపరి చిత్రాన్ని  ప్రారంభించాడు. తనతో జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి లాంటి సినిమాలను తెరకెక్కించిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో హ్యాట్రిక్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించాడు బన్నీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top