గాయమైనా నో బ్రేక్‌

Alia Bhatt shoots for Gully Boy despite her injury  - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకోవడం అంత ఈజీ మేటర్‌ కాదు. ఎంతో కష్టపడితే కానీ సాధ్యం కాదు. అందుకు బెస్ట్‌ ఎగ్జామ్‌పుల్‌గా హీరోయిన్‌ ఆలియా భట్‌ను చెప్పుకోవచ్చు. ఎందుకంటే... భుజానికి తీవ్ర గాయమైనా షూటింగ్‌కి రెడీ అయిపోయారామె. అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. బల్గేరియాలో జరిగిన ఈ సినిమా షూటింగ్‌లో ఓ స్టంట్‌ చేస్తూ బాగానే గాయపడ్డారు ఆలియా భట్‌. దీంతో.. ఆమె ఆల్మోస్ట్‌ 15 రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉంటుందని భావించారు.

పైగా డాక్టర్స్‌ కూడా రెస్ట్‌ తీసుకోమని ఆలియాకు సూచించారు. అంతేకాదు చేతికి ఉన్న స్లింగ్‌ (కట్టు)ను ఫుల్‌డే అలాగే ఉంచాలని కూడా చెప్పారట. కానీ... ఇవేమీ పట్టించుకోకుండా ఇరవై రోజుల ‘గల్లీభాయ్‌’ షూటింగ్‌కు రెడీ అయిపోయారు ఆలియా భట్‌. ఆలియా తీరు చూస్తుంటే.. పని ఇష్టంగా ఉంటే గాయమైనా హాయేగా అన్నట్లు ఉంది కదూ! జోయా అక్తర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్, ఆలియా భట్‌ జంటగా రూపొందుతున్న సినిమా ‘గల్లీభాయ్‌’. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఆలియా.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.. ఆరోగ్యం జాగ్రత్త’’ అని ఆమె అభిమానులు అంటున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top